NTV Telugu Site icon

MRF First Indian Stock: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎంఆర్ఎఫ్ అరుదైన రికార్డు

Mrf

Mrf

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎంఆర్ఎఫ్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఎంఆర్ఎఫ్ షేరు ధర లక్ష రూపాయలను ఈ రోజు తాకింది. బీఎస్ఈలో 1,00,300ను ఈ షేరు తాకింది.. ప్రస్తుతం రూ.99999 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ షేరు ఏడాది కనిష్ఠ ధర రూ.65,900గా నిలిచింది. ఒక్క షేరు రూ.లక్షకు చేరిన మరో ఘటన భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎప్పుడు లేదు. నిజానికి ఈ ఏడాది మే నెలలోనే ఎంఆర్ఎఫ్ షేరు ధర రూ.లక్ష దగ్గరకు చేరుకుంది. రూ.లక్షను నమోదు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అక్కడ లాభాల స్వీకరణ ఎదురు కావడంతో అమ్మకాల ఒత్తిడికి షేరు ధర దిగజారింది.

Also Read : Kuchadi Srinivasrao: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి కూచాడి శ్రీనివాసరావు

ఎంఆర్ఎఫ్ తర్వాత మన దేశంలో అధిక ధర వద్ద ట్రేడయ్యే మరో షేరు హనీవెల్ ఆటోమేషన్.. ఇది ప్రస్తుతం రూ.41,152 వద్ద ట్రేడింగ్ అవుతోంది. అలాగే, పేజ్ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్, 3ఎం ఇండియా, అబాట్ ఇండియా, నెస్లే, బాష్ షేర్ల ధరలు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. మరి ఎంఆర్ఎఫ్ షేరు ఎందుకు అంత అధికంగా ఉంది..? అన్న సందేహం మనకు రావచ్చు.. ఎంఆర్ఎఫ్ ఈక్విటీ చాలా చిన్నది.. మొత్తం ప్రమోటర్లు, ప్రజల వద్దనున్న షేర్లు 42,41,143. ఎంఆర్ఎఫ్ టైర్ల పరిశ్రమలో దిగ్గజ కంపెనీ కావడం, భారీ అమ్మకాలు, లాభాలతో షేరు వారీ ఆదాయం అధికంగా ఉంది. అందుకే షేరు ధర రూ.లక్షకు చేరుకుంది.

Also Read : Varahi Yatra: పవన్ వారాహి యాత్రకు లైన్ క్లియర్

సాధారణంగా షేరు ధర తక్కువలో ఉంటే చిన్న ఇన్వెస్టర్లు కూడా కొనుగోలుకు ముందుకు వస్తారు. దాంతో ట్రేడింగ్ పరిమాణం పెరుగుతుంది. ఫ్లోటింగ్ లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు షేరు ధర పెరిగే క్రమంలో ముఖ విలువను విభజిస్తూ.. బోనస్ ప్రకటిస్తుంటాయి. దాంతో షేరు ధర తగ్గుముఖం పడుతుంది. కానీ.. ఎంఆర్ఎఫ్ అలాంటివి ఎప్పుడూ చేయలేదు.. అందుకే షేరు ధర కొండెక్కిందని చెప్పుకోవచ్లిచు.. అంత ధర ఉన్నా ఒక్కో షేరు పీఈ 55గానే ఉండడం మనం గమనించొచ్చు.

Show comments