NTV Telugu Site icon

YS Avinash Reddy: పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చంద్రబాబును ప్రజలు సస్పెండ్ చేయాలి..

Ys Avinash Reddy

Ys Avinash Reddy

YS Avinash Reddy: అవ్వ, తాతలకు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడును ప్రజలు సస్పెండ్ చేయాలంటూ పిలుపునిచ్చారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. మరోసారి కడప నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగన వైఎస్ అవినాష్‌రెడ్డి.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి పేరుతో మందిని కూడగట్టుకుని తప్పుడు ఆరోపణలతో వస్తున్నాడు చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీ-జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? అని నిలదీశారు. రంగురంగుల మ్యానిఫెస్టోతో ఎన్నికలకు వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Read Also: OnePlus Nord CE4 Launch: నేడు మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4’.. ధర, ఫీచర్లు ఇవే!

2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, ప్రతి ఇంటికి ఉద్యోగం అన్న చంద్రబాబు హామీలు అమల్లో విఫలం అయ్యాయని విమర్శించారు అవినాష్‌ రెడ్డి.. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో అనేకమంది మృత్యువాత పడ్డారు.. అవ్వ తాతలకు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడును ప్రజలు సస్పెండ్ చేయాలి.. ప్రజలను ఇబ్బంది పెట్టేవారు మనకు అవసరమా? అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి. కాగా, వరుసగా రెండో రోజు ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది.. ఉదయం నుంచి సచివాలయాల దగ్గర వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ల కోసం బారులు తీరారు.. అయితే, పెన్షన్ల పంపిణీ తొలి రోజు ఎండ దెబ్బతో రాష్ట్రంలో నలుగురు వృద్ధుల ప్రాణాలు పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.