ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యలు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు. “పురందేశ్వరి గారు.. కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు.. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు.. మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే.. మీ అంతిమ లక్ష్యం కుల ఉద్దారణే.. మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు.. స్వార్థం తప్ప.. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అంటూ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Assembly Elections 2023: రమణ్ సింగ్ నుండి అక్బర్ వరకు… ప్రమాదంలో ఛత్తీస్ గఢ్ అధినేతల భవితవ్యం
మరో ట్విట్టర్ ( ఎక్స్ ) పోస్ట్ లో.. ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి!.. ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి.. పాపం!.. 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే.. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా! అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసుకొచ్చారు.
00