MP: మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి, మధ్యప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేస్తున్న తన భార్యపై ఫిర్యాదు చేశాడు. వేధింపులు, వివాహేతర బంధంపై కంప్లైంట్ ఇచ్చాడు. ఆ భర్త తన భార్యకు మంచి చదువును అందించి ఆమె కలలను నెరవేర్చాడు. కానీ ఆ మహాతల్లి నిర్వకం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది.
READ MORE: Donald Trump: ట్రంప్ మళ్లీ పిచ్చికూతలు.. భారత్-పాక్‌తో సహా 7 యుద్ధాలను నేనే ఆపా..
కట్ని జిల్లాకు చెందిన జైలాల్ కచ్చి అనే ఫిర్యాదుదారుడు తన భార్య రీటా బార్డేను కష్టపడి చదివించానని చెప్పాడు. దీంతో ఆమెకు మధ్యప్రదేశ్ పోలీసుల శాఖలో ఉద్యోగం వచ్చిందని తెలిపాడు. ఈ జంట మే 10, 2023న వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం రీటాకు సాగర్ జిల్లాలోని గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇద్దరు దంపతులు కలిసి అక్కడ ఏడాది పాటు అద్దె ఇంట్లో నివసించారు. అయితే.. పని నిమిత్తం తన భర్త జైలాల్‌ను భార్య రిటా జబల్‌పూర్‌కు పంపింది. అక్కడే పని చేస్తున్న జైలాల్ ఆగస్టులో తిరిగి సాగర్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఓ రోజు తన భార్య మొబైల్ ఫోన్ను పరిశీలించారు. ఆ ఫోన్‌లో “లక్కీ” అనే యువకుడితో దిగిన ఫోటోలు, వీడియోలు కనిపించాయని జైలాల్ పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత నిలదీయండంతో రీటా, ఆమె ప్రేమికుడు లక్కీ తనను బెదిరిస్తున్నారని, ఉద్యోగ బలాన్ని ప్రదర్శించి తనపై ఒత్తిడి తెస్తున్నారని బాధితుడు జైలాల్ చెబుతున్నాడు. ఈ మేరకు న్యాయం కోసం పోలీసు సూపరింటెండెంట్‌కు విజ్ఞప్తి చేశాడు. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. తన భార్యను చదివించేందుకు రాత్రి, పగలు కష్టపడి పని చేశానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
