DJ: పెళ్లి వేడుకను పండుగలా చేసుకోవాలని చాలా మంది కలలు కంటారు. జీవితకాలం గుర్తుండి పోయేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఎవరికున్న తాహత్తులో వారి విహహాన్ని అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే పెళ్లికి వచ్చిన అతిథుల దగ్గరనుంచి..వేడుక ముగిసి ఊరేగింపు వరకు ఫర్ ఫెక్ట్ గా జరగాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ప్రతి పెళ్లి ఊరేగింపులోనూ నేడు డీజే, డ్యాన్స్ కామన్ అయిపోయింది. ఈ తతంగంపై కొందరు సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. సంప్రదాయబద్ధంగా జరగాల్సిన వివాహాల్ని ట్రెండ్ పేరుతో చెడగొడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిని నియంత్రించాలని కొంతమంది కోరుతున్నారు. ఈ క్రమంలోనే మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఓ పెళ్లి వేడుకలో ఓ మత గురువు పెళ్లికి డీజే పెట్టినందుకు పెళ్లిని జరిపించనని అసహనం వ్యక్తం చేస్తూ లేచి వెళ్లిపోయాడు. అంతే కాకుండా డీజే ఏర్పాటు చేసిన వరుడి కుటుంబ సభ్యులపై కోపడ్డాడు.
Read Also: Kerala Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆ ఛానళ్లు ఉండొద్దు
ఈ ఘటన ఇటీవల మధ్యప్రదేశ్‌లోని చతార్‌పూర్‌లో జరిగింది. అక్కడి ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన పెళ్లి వేడుక జరిపించేందుకు మత గురువు హాజరయ్యాడు. ఒక పక్క పెళ్లి జరుగుతుంటే, మరో పక్క డీజే, డ్యాన్స్‌లు కూడా వరుడి కుటుంబ సభ్యులు నిర్వహించారు. దీనిపై మత గురువు అసహనం వ్యక్తం చేశారు. ‘‘మన సమాజంలో ఇలాంటి అనవసరమైన వాటిపై నిషేధం ఉంది. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో డీజేలు పెట్టడం, డ్యాన్సులు చేయడం సరికాదు. ఈ సమాజంలో అందరూ సమానమే. ముస్లిం సమాజంలో డ్యాన్స్‌లు చేయడం, డీజేలు పెట్టడం నిషేధం. ముస్లిం సమాజానికి చెందిన చాలా మందితో చర్చించి గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటివి సరికాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మత పెద్ద వ్యాఖ్యల నేపథ్యంలో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు మత పెద్దకు క్షమాపణలు చెప్పారు. డీజే, డాన్స్‌లు ఆపేయించారు. దీంతో మత పెద్ద తిరిగి తన పెళ్లి తంతు నిర్వహించాడు.