Site icon NTV Telugu

Moto G55 Launch: మోటో నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్స్ అదుర్స్, ధర తక్కువే!

Moto G55 Launch

Moto G55 Launch

Moto G55 Launched Soon in India: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా మిడ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ చేసింది. మోటో జీ55, మోటో జీ35లను యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు చాలావరకు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి.

మోటో జీ 55 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర 249 యూరోలు (భారత కరెన్సీలో రూ.24,000)గా ఉంది. మోటో జీ 35 ధర 199 యూరోలు (రూ.18,500). ఈ రెండు ఫోన్‌లు ఒకే వేరియంట్‌లలో విడుదలయ్యాయి. ఫారెస్ట్ గ్రే, స్మోకీ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో మోటో జీ 55 అందుబాటులో ఉంటుంది. లీఫ్ గ్రీన్, జామ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, సేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో మోటో జీ 35 వస్తుంది.

మోటో జీ 55 స్మార్ట్‌ఫోన్‌ 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, 120 హెచ్ రిఫ్రెష్ రేట్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. మోటో జీ 35 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. మోటో జీ 55 మీడియా టెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌తో, మోటో జీ 35 యూనిసాక్ టీ 760 చిప్‌సెట్‌తో వస్తుంది. రెండు 8 జీబీ+256 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Also Read: boAt Airdopes Offers: అమెజాన్‌లో భారీ ఆఫర్‌.. బోట్‌ బడ్స్‌పై 73 శాతం డిస్కౌంట్!

మోటో జీ 55 వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. మోటో జీ 35 కూడా ఇదే కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది కానీ.. ప్రాథమిక కెమెరా తప్ప ఓఐఎస్‌కి మద్దతు ఇవ్వదు. రెండు ఫోన్‌లు 5000mAh బ్యాటరీతో వస్తున్నాయి. అయితే జీ 55 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, జీ 35 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

Exit mobile version