Site icon NTV Telugu

Mahabubabad: తల్లి కర్కషత్వం.. కొడుకు పై వేడి నీళ్ళు పోసి దారుణం.. కారణం అదే!

Mahabubabad

Mahabubabad

మహబూబాబాద్ జిల్లా గూడూరు (మ )చంద్రు గూడెం లో తల్లి కర్కషంగా వ్యవహరించింది. క్షణికావేశంతో దారుణానికి ఒడిగట్టింది. కొడుకు పాండవుల శ్రీనివాస్ పై వేడి నీళ్ళు పోసింది కన్నతల్లి. మద్యానికి బానిస అయిన కొడుకు.. ఇంటికొచ్చి రోజు గొడవ పడుతుండడం తో విసిగిపోయింది. నిత్యం నరకం చూపిస్తుండడంతో సహనం కోల్పోయి కొడుకుపై వేడి నీళ్ళు పోసింది. దీంతో అతనికి ఒంటినిండా తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికుల సాయంతో ముందుగా గూడూరు ఆసుపత్రి కి తరలించారు. 60 శాతం కాలడం తో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Exit mobile version