Site icon NTV Telugu

Mother Kills Daughter: ప్రియుడు కోసం కన్నకూతురిని కడతేర్చిన తల్లి.. నేడు చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం

Tpt

Tpt

Mother Kills Daughter: తిరుపతిలో ప్రియుడు కోసం కన్న కూతురినే ఓ కసాయి తల్లి కడతేర్చింది. ​ప్రియుడితో కలిసి రెండున్నరేళ్ల చిన్నారి దుర్గను దారుణంగా ఆషాలత హతమార్చంది. ​భర్త రాజేష్‌తో విడిపోయి పోస్టల్ కాలనీలో తల్లి నివాసం ఉంటుంది. ఏర్పేడు మండలం చెన్నపల్లికి చెందిన రెడ్డి కుమార్‌తో ఆషాలత గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. ​పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఆమె ఒత్తిడి తెచ్చింది. ​చిన్నారి అడ్డుగా ఉందని వివాహానికి రెడ్డి కుమార్ నిరాకరించాడు. దీంతో ​ఇద్దరూ కలిసి చిన్నారిని చంపి పాపానాయుడు పేట స్వర్ణముఖి నదిలో పాతిపెట్టారు.

అయితే, తమ ​మనవరాలు కనిపించడం లేదని అమ్మమ్మ రంగ నాగరత్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు తల్లి ఆషాలత ను తమదైన స్టైల్ లో విచారణ చేయగా, అక్రమ సంబంధం వల్లే త కూతుర్ని చంపేసినట్లు ఒప్పుకోవడంతో.. ​ఆషాలత, రెడ్డి కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version