Site icon NTV Telugu

Jharkhand: సవతి కొడుకును హత్య చేసిన కసాయి తల్లి.. కారణమదే..!

Jharkhand

Jharkhand

జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. అమ్మ ప్రేమకే అవమానం ఎదురైంది. అమ్మ లాంటి పవిత్రమైన పదాన్ని కూడా కించపరిచిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఓ మహిళ 12 ఏళ్ల సవతి కొడుకును పని సాకుతో పిలిచి ఇనుప రాడ్‌తో మోదీ హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుకాల గొయ్యి తీసి పాతిపెట్టింది. ఎవరికి అనుమానం రాలేదనుకున్న మహిళ.. తన అన్నను హత్య చేస్తుంటే తమ్ముడు చూశాడు. దీంతో వెంటనే స్థానికులకు తెలియజేయడంతో.. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఛతర్‌పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. చిన్నారి మృతదేహాన్ని గోతిలోంచి బయటకు తీయించారు. అనంతరం హత్యకు పాల్పడిన మహిళ కాజల్ దేవిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసుల ఎదుటే హత్య చేసిన నేరాన్ని నిందితురాలు అంగీకరించింది.

People Media factory: చిరుతో సినిమా లేదు.. ఉంటే మాకన్నా ఆనందపడే వాళ్ళు లేరు!

హత్యకు గల కారణమేంటంటే..!
మన్హో గ్రామానికి చెందిన లాల్మోహన్ యాదవ్ రెండు వివాహాలు చేసుకున్నాడు. లాల్మోహన్ యాదవ్‌కు మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉండగా.. రెండవ భార్య కాజల్ దేవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి భార్య కొడుకులంటే.. కాజల్ దేవికి నచ్చేది కాదు. వారిద్దరినీ ఏదో సాకుతో హింసించేది. అయితే అనుకోకుండా ఆ 12 ఏళ్ల కుమారుడితో ఏదో విషయమై గొడవ పడింది. ఈ వివాదంతో కోపం పెంచుకున్న సవతి తల్లి కాజల్ దేవి.. అతన్ని హతమార్చాలని ప్లాన్ వేసింది. పని సాకుతో వివేక్‌ని తన వద్దకు పిలిచిన మహిళ.. రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసింది. మరోవైపు హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version