NTV Telugu Site icon

Assam : అమ్మతనానికే కళంకం, 20 నెలల చిన్నారికి మందు, సిగరెట్ …

Mother Son

Mother Son

ఒక మహిళ తన 20 నెలల పాపను సిగరెట్ మరియు మద్యం తాగమని బలవంతం చేసిన ఘటన తాజాగా అస్సాం, సిల్చార్‌లోని చెంగ్కూరిలో జరిగింది. స్థానిక చైల్డ్ హెల్ప్‌లైన్ సెల్‌కు ఫోటోలతో పాటు మహిళపై ఫిర్యాదు అందగా వెంటనే, పోలీసులు మహిళ నివాసానికి చేరుకొని బిడ్డను రక్షించి విచారణ కోసం తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

సిల్చార్‌లోని చెంగ్‌కూరిలో పసిపాపకు పొగ, మద్యం తాగించి తల్లి తన బిడ్డను వేధిస్తున్నట్లు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించి తగు చర్యలు తీసుకుని తల్లిని అదుపులోకి తీసుకొని బిడ్డను రక్షించినట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం, తల్లి మరియు బిడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కస్టడీలో ఉన్నారని, సమగ్ర విచారణ తర్వాత రుజువులను పరిశీలించి, తల్లిని విచారించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చాలా మంది నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు కొందరు బిడ్డను బాధ్యతాయుతమైన కుటుంబానికి బిడ్డను దత్తత ఇవ్వాలి అని సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియచేస్తున్నారు.