NTV Telugu Site icon

Jalumuri Srinivas: పోలీసుల అదుపులో మావోయిస్ట్ జలుమూరి శ్రీనివాస్

Collage Maker 16 Feb 2023 07.26 Pm

Collage Maker 16 Feb 2023 07.26 Pm

పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనో ఉన్నట్టు తెలుస్తోంది. జాయింట్ ఆపరేషన్ బలగాలు జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనో ని అరెస్ట్ చేసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది. 2018 అరకు మాజీ ఎమ్మెల్యేల హత్య కేసులో రైనో నిందితుడుగా ఉన్నాడు. NIA ఛార్జ్ షీటులో రైనో పేరు ఉంది. మల్కన్ గిరి జిల్లా కోటియ బ్లాక్ లో ఆంధ్ర,ఒరిస్సా,ఛత్తీస్ గడ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి రైనో ను పట్టుకున్నారు. రైనోను వెంటనే కోర్టులో హాజరు పరచాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. రైనో ప్రాణానికి హాని జరిగితే పోలీసులు,స్థానిక నాయకులదే బాధ్యత అని హెచ్చరించింది. ఈమేరకు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి జగబంధు ప్రకటన విడుదల చేశారు.

Read Also: Mark Zuckerberg: జుకర్‌బర్గ్‌కు భారీ స్థాయిలో భద్రత పెంపు..అందుకేనా!

2018లో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కలకలం రేపింది. ఈ హత్యలకు సంబంధించి కొందరు నేతలు మావోయిస్టులకు సమాచారం ఇచ్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అందులో భాగంగా పలువురు టీడీపీ నేతల కాల్ డేటాను విశ్లేషించారు. అందులో భాగంగా మాజీ ఎంపీటీసీ సుబ్బారావుతో సహా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీంతో, ఎద్దుల సుబ్బారావు, భీమిలి శోభన్, కమలలపై ఎన్ఐఏ అభియోగాలు మోపి విచారించింది. కిడారి సర్వేశ్వర్ రావు , సోములకు కదిలికలకు సంబంధించిన సమాచారం మావోలకు ఇచ్చారని వీరు ఇచ్చిన సమాచారంతోనే పక్కా ప్లాన్ తో దాడి చేసి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్ రావు ను . సివేరి సోములను రైనో కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న రైనోకు ప్రాణహాని ఉందంటున్నారు మావోయిస్టులు.

Read Also: Komatireddy Venkat Reddy: నల్గొండలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ