NTV Telugu Site icon

UK Drug Lord: మోస్ట్‌ వాంటెడ్‌, బ్రిటీష్‌ క్రైమ్‌ బాస్‌.. ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లో అరెస్ట్‌

Uk Drug Lord

Uk Drug Lord

UK Drug Lord: ఐదేళ్ల తర్వాత పరారీలో ఉన్న బ్రిటీష్ క్రైమ్ బాస్‌ను థాయ్‌లాండ్‌లో అరెస్టు చేసినట్లు థాయ్ పోలీసులు ఆదివారం తెలిపారు. రిచర్డ్ వేకెలింగ్ 2016లో యూకేలోకి 8 మిలియన్ల యూరోల ($9.6 మిలియన్లు) లిక్విడ్ యాంఫెటమైన్‌ను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన తర్వాత 2018లో పారిపోయాడు. అతను 2018లో తన 12 వారాల విచారణ ప్రారంభం కాకముందే పారిపోయాడు.ఆ సంవత్సరం ఏప్రిల్ 9న చెమ్స్‌ఫోర్డ్ క్రౌన్ కోర్టులో అతను హాజరుకాలేదు. ఆ సమయంలోనే దోషిగా నిర్ధారించబడి 11 సంవత్సరాల శిక్ష విధించబడింది. బ్రిటిష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ “మోస్ట్ వాంటెడ్” వాచ్ లిస్ట్‌లో అతని పేరును చేర్చింది.

Lightning strike: క్రీస్తు విగ్రహంపై మెరుపు.. వైరల్ అవుతున్న ఫోటో..

నిజానికి ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని ఎసెక్స్ కౌంటీకి చెందిన వేకెలింగ్‌ను శుక్రవారం థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎన్సీఏతో కలిసి పట్టుకుంది. 1993 నుండి అతను క్రమం తప్పకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లేవాడు. బీచ్‌సైడ్ టౌన్ హువా హిన్‌లో నివసిస్తున్న వేకెలింగ్, మరొక గుర్తింపులో పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడు. అయితే అతని పేరు, అతని పాస్‌పోర్ట్ జాతీయతను ఐరిష్‌గా మార్చుకున్నాడు, అందుకే అది సిస్టమ్‌లో కనిపించలేదని సీనియర్ థాయ్ పోలీసు అధికారి చెప్పారు. అతన్ని అరెస్ట్‌ చేసినట్లు, అతని పేరును ధ్రువీకరించినట్లు ఆ అధికారి తెలిపారు. సోమవారం రిచర్డ్ వేకెలింగ్‌ను కోర్టుకు తీసుకెళతామని ఆయన వెల్లడించారు. అతను చాలా సంవత్సరాలుగా సముద్రతీర రిసార్ట్ టౌన్ హువా హిన్‌లో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతని ఆచూకీపై సమాచారం కోసం ఎన్‌సీఏ గతంలో అప్పీళ్లను జారీ చేసింది. వేకెలింగ్‌కు ఉత్తర ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, కెనడా, స్పెయిన్, థాయిలాండ్‌లలో లింకులు ఉన్నాయి.