Site icon NTV Telugu

Maoist Sujatha: పోలీసుల ఎదుట లొంగిపోయిన మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు

Sujathakka

Sujathakka

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయింది. గద్వాల్ కు చెందిన సుజాతక్క చిన్నప్పుడే అడవిబాట పట్టింది. గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్‌ పోతుల కల్పన. 1984లో మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీతో వివాహం జరిగింది. కొన్నాళ్ల క్రితమే ఎన్కౌంటర్లో కిషన్ జి చనిపోయారు. సుజాతక్క సెంట్రల్ కమిటీ మెంబర్ గా పని చేసింది. జనతన సర్కార్ ఇంచార్జ్ గా పని చేసిన ఆమెపై 104 కేసులు నమోదయ్యాయి. మొత్తం 106 కేసుల్లో నిందితురాలుగా సుజాతక్క ఉంది. సుజాతక్క 43 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్నది. ఆమెపై కోటి రూపాయలు రివార్డ్ ప్రకటించారు.

Exit mobile version