NTV Telugu Site icon

Varahi Temple in Hyderabad : హైదరాబాద్ లో వారాహి ఆలయం.. విశిష్టత తెలుసా..?

Varahi Mata

Varahi Mata

వారాహి నవరాత్రోత్సవాల్లో నేడు చివరి రోజు. వారాహి అమ్మవారి ఆలయాలు ఉండటం చాలా అరుదు. అయితే.. హైదరాబాద్ మొత్తంలో ఒక్కటే వారాహి అమ్మవార దేవాలయం ఉంది. అది కూడా కొత్తపేటలో ఉంది. ఇక్కడ వారాహి అమ్మవారితో పాటు.. శరభేశ్వరుడు, ప్రత్యంగిర దేవి కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే.. కాశీలో రాత్రుల్లు వారాహి అమ్మవారు తిరుగుతుందని ప్రతీతి. భూ సమస్యలు, ఆస్తి తగాదాలు వంటి సమస్యలతో పాటు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నవారు వారాహి అమ్మవారిని దర్శించుకుంటారని అక్కడి వారి నమ్మకం. అయితే.. కాశీలో వారాహి అమ్మవారిని దర్శించుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలోనే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ లోని వారాహి అమ్మవారి దేవాలయం గురించి చెప్పుకుంటే.. కొత్తపేటలోని రామకృష్ణపరంలో రోడ్ నెం.1లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎలాంటి డోనేషన్లు స్వీకరించరు. దర్శనం పూర్తిగా ఉచితం. ఈ ఆలయంలో వారాహి అమ్మవారికి పుసుపు కొమ్ములతో దండను వేస్తే.. ప్రత్యంగిర అమ్మవారికి ఎండు మిరపకాయలతో దండను వేస్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.