NTV Telugu Site icon

Most Expensive Maggie : ఈ మ్యాగీ చాలా ఖరీదైనది.. ఎందుకో తెలుసా?

Maggii

Maggii

ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే మటన్ మ్యాగీ.. చికెన్ తో చెయ్యడం చూసాము మరి ఈ మ్యాగీ ఎలా చేస్తారో అనే సందేహం అందరికీ వస్తుంది కదూ.. ఒకసారి ఈ వీడియోను చూడండి..

సూపర్ ఫాస్టుగా చేసుకొనే ఫుడ్ ఏంటంటే అది మ్యాగినే.. చాలా మంది ఈ వాసనకు టెంప్ట్ అవుతారు.. ఇప్పుడు ఈ వింత ను చూసి అందరు షాక్ అవుతున్నారు.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మ్యాగీ మటన్ ను తయారు చేశాడు.. హాట్ గా స్పైసి గా ఉండే మ్యాగిని ఇప్పుడు మటన్ తో తినాల్సి వస్తుంది.. దీన్ని తయారు చేసే వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా.. ముందుగా మటన్ ను కర్రీ చేసి పక్కన పెట్టుకుంటాడు..

ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసి మటన్ కూరను వేసాడు.. అది కాస్త వేడి అయ్యాక మ్యాగీని వేస్తాడు.. అది ఉడికే వరకు మటన్ పులుసును వేస్తూ కలబెడతాడు.. రెండు మూడు సార్లు వేసి పులుసులోనే మ్యాగీ ని ఉడకబెడతాడు.. పులుసులోంచి రెండు మటన్ ముక్కలను మ్యాగీ లోకి వేస్తాడు.. ఆ తర్వాత మ్యాగిని ఒక ప్లేట్ లోకి తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి ఇస్తాడు.. అంతే.. దీని ధర రూ. 1100 ఉంటుందని చెబుతున్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒకసారి చూసేయ్యండి..