మరికొద్ది రోజుల్లో క్రిష్టమస్ పండుగ రాబోతుంది.. ఇక చిన్న స్వీట్ షాప్ నుంచి పెద్ద బేకరీలు రకరకాల కేకులను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే ఎంత పెద్ద కేకు అయిన వేలల్లో ఉంటుంది.. కానీ కేకు లక్షకు పై ధర పలకడం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఇప్పుడు మనం చెప్పుకొనే కేకు ధర అక్షరాల లక్షలు.. వామ్మో అంత ధరనా? అందులో ఏముంది అనే సందేహం రావడం కామన్..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేకు గురించి విన్నారా.. ఆ కేకు ధర ఎంత? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వైల్డ్ బెర్రీ క్రిస్టల్ మాకరాన్ చీజ్ మరియు పాంపాన్ వనిల్లా కారామెల్ గ్రేడ్ A కేక్ హ్యాండ్‌క్రాఫ్ట్ మరియు ఫ్రాన్స్‌లోని లౌవ్రే మ్యూజియం కళాకారులచే రూపొందించబడినవి లగ్జరీ జీవనానికి నిదర్శనం.. ఇన్‌స్టాగ్రామ్‌లోని @దృహోబ్స్ వినియోగదారుడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ కేకు ధరతో లగ్జరీ కారుని కారును కోనేయ్యొచ్చునని ట్యాగ్ చేశారు.. పేస్ట్రీ ఫోర్క్ కూడా 78k స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది..
వైల్డ్ బెర్రీ క్రిస్టల్ మాకరోన్ చీజ్‌కేక్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బంగారు మాకరాన్‌తో కలపబడింది. మాకరాన్ ధర ఒక్కటే $9,703 డాలర్లు (రూ. 8,08,887) అయితే పాంపాన్ వెనిలా కారామెల్ గ్రేడ్ A చాలా అరుదైన వనిల్లాతో మరియు తినదగిన స్వచ్ఛమైన బంగారంతో చుట్టబడి ఉంది.. దీని ధర $1,500 (రూ. 1,25,047).లౌవ్రే మ్యూజియంలోని వ్యక్తులు దీనిని తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు.. ఈ కేకుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.. అంతేకాదు దానికి 8/10 రేటును ఇస్తున్నారు.. మొత్తానికి నెట్టింట ఈ కేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి..