Site icon NTV Telugu

Mortuary monster : శవాలను కూడా వదలని కీచకుడు.. ఏకంగా 101 మృతదేహాలతో..

Romance With Bodies

Romance With Bodies

Mortuary monster: ఇద్దరు మహిళలను హత్య చేసి, మార్చురీలలో శవాలను లైంగికంగా వేధించినందుకు బ్రిటన్‌లో పూర్తి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆసుపత్రి ఎలక్ట్రీషియన్ గురువారం మరో 23 మంది చనిపోయిన మహిళలను అపవిత్రం చేసినట్లు అంగీకరించాడు. డేవిడ్ ఫుల్లర్ అనే వ్యక్తి గతంలో 1987లో ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని కెంట్‌లో 25 ఏళ్ల వెండీ కెనెల్, 20 ఏళ్ల కరోలిన్ పియర్స్‌ను నెలల వ్యవధిలో గొంతు కోసి చంపినట్లు అంగీకరించాడు. 2008-2020 మధ్య మార్చురీలలో 78 మృతదేహాలపై పుల్లర్‌ లైంగికంగా దాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. గురువారం క్రోయిడాన్ క్రౌన్ కోర్ట్‌లో జరిగిన విచారణలో ఫుల్లర్ ఆసుపత్రి మార్చురీలలో చనిపోయిన మరో 23 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు అంగీకరించాడు. ఆ కామాంధుడు మొత్తం 101 మృతదేహాలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది.

Corpse In Toilet: టాయిలెట్‌లో మృతదేహం.. 900 కిలోమీటర్లు ప్రయాణించిన రైలు

గతేడాది నిందితుడు డేవిడ్‌ పుల్లర్‌ హత్యానేరం కింద శిక్ష విధించబడినప్పుడు సామాన్యమైన, సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు కనిపించాడని.. కానీ అనంతరం దారుణ చర్యలకు పాల్పడినట్లు తెలిసిందని న్యాయమూర్తి బాబీ చీమా గ్రబ్ వెల్లడించారు. నేరస్థుడైన పుల్లర్‌ ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా విస్తుపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పుల్లర్ 1989 నుంచి ఆస్పత్రి ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌లో పనిచేస్తుండగా.. రెండు మార్చురీలో శవాలపై లైంగిక దాడులను స్వయంగా చిత్రీకరించాడు. ఆ దృశ్యాల్లో మృతదేహాలతో తన లైంగిక వాంఛను తీర్చుకున్నాడు. వాటిని వీడియోలు తీశాడు. చిన్న పిల్లల మృతదేహాలను కూడా వదల్లేదు ఆ దుర్మార్గుడు. పుల్లర్‌ నేరాలను ఇంతకాలం ఎంలా పసిగట్టకుండా పోయామని ప్రభుత్వం స్వతంత్ర విచారణను ప్రకటించింది.

Exit mobile version