NTV Telugu Site icon

Kenza Layli : తొలి మిస్‌ ఏఐ కిరీటాన్ని కైవసం చేసుకున్న మొరాకో ఇన్‌ఫ్లుయెన్సర్‌..

Kenza Layli

Kenza Layli

Kenza Layli From Morocco World First Ever AI : ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగిన ” మిస్‌ ఏఐ ” అందాల పోటీలో మొదటి కిరీటాన్ని మొరాకో దేశానికీ చెందిన ” కెంజా లైలీ ” అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌ గెలుచుకుంది. కృత్తిమ మేధస్సు పరంగా ఆవిడ మొదటి స్థానంలో నిలిచింది. సుమారు 1500 ఏఐ మోడల్ లను వెనక్కి నెట్టి కిరీటాన్ని గెలుచుకుంది. ఇక ఈ ఏఐ ను సృష్టించినందుకు గాను మెరియం బెస్సాకు రూ. 16 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఇక విజేతగా నిలిచిన లైలికి ఇంస్టాగ్రామ్ ఖాతాలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస..

ఈ ఏఐ ఫ్యాషన్, ఆహారం, సంస్కృతి, అందం, ట్రావెల్స్ లాంటి వాటి గురించి కంటెంట్ అందిస్తుంది. వర్చువల్ పాత్రలో లేని గొప్ప వారసత్వాన్ని సంపాదించింది. ఆమె సాంకేతిక అలాగే సంస్కృతిక ప్రత్యేక కలయికను కలిగి ఉంది. ఈ ఏఐ మొత్తం ఏడు భాషల్లో ఫాలోవర్స్ తో నిరంతరం టచ్ లో ఉంటుంది. ఈ మేరకు వర్చువల్ ఏఐ మోడల్ మాట్లాడుతూ.. మొరాకో కోసం సగర్వంగా ప్రదర్శించడమే తన ఆశయం అన్నట్లుగా తెలిపింది. అంతేకాకుండా తన ఫాలోవర్స్ కు బహుళ రంగాల్లో సమాచారం అందించడం తన పని అని చెప్పింది. అలాగే పర్యావరణాన్ని రక్షించడానికి సానుకూలమైన రోబోట్ సంస్కృతి గురించి అవగాహన పెంచుకుంటానని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది కేవలం మానవ సామర్థ్యాలను భర్తీ చేసేందుకు మాత్రమే రూపొందించిన ఒక సాధనం అని మాత్రమేనని అన్నిటిని ఇది భర్తీ చేయలేదని తెలిపింది.

Anam Ramanarayana Reddy: చంద్రబాబు సూచనతో దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం..!

ఏ సాంకేతిక, మానవులు మధ్య సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లైలీ తెలిపింది. ప్రస్తుత సమాజంలో ఏఐ ఆధారిత సంబంధించిన మరింత సమాచారం పొందగలమనే ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చునని అంటుంది. ఇక ఈ అవార్డు గెలుచుకున్నందుకు ఎంతగానో గర్వపడుతున్నానని.. అది కూడా తన దేశం గెలిచినందుకు సంతోషిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఏఐ మోడల్ సృష్టించిన మెరియం బెస్సా మాట్లాడుతూ.. తాము మొరాకో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం అని తెలిపింది. ప్రస్తుతం సాంకేతిక రంగంలో మొరాకో ఆఫ్రికన్ అరబ్ ముస్లిం మహిళలను హైలెట్ చేయడంలో తాను కూడా భాగస్వామ్ని అయినందుకు ఎంతో గర్వంగా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ విజయం ఏఐ క్రియేటర్ల విజయాలను జరుపుకోవడానికి భవిష్యత్తులో స్టార్ట్స్ జరిగేలా చేసే ఓ అద్భుతమైన వేదికంటూ పేర్కొంది.