Morbi Bridge Tragedy: గుజరాత్‌లో మోర్బీలలో వంతెన కూలిన దుర్ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ విభాగం చీఫ్ ఆఫీసర్(సీవో)ను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఘటన జరిగినప్పుడూ సందీప్‌సిన్హ్ జాలా చీఫ్ ఆఫీసర్‌గా ఉండటంతో వేటు విధించామని కమిటీ స్పష్టం చేసింది. దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ధిష్ట అభియోగాన్ని మోపలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయనపై వేటు వేసినట్లు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జీటీ పాండ్య తెలిపారు.
Twitter: భారత్‌లోనూ ట్విటర్ ఉద్యోగులకు షాక్.. తొలగింపు ప్రారంభం
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రెసిడెంట్ అదనపు కలెక్టర్‌కు చీఫ్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు. తీగల వంతెన కాంట్రాక్ట్‌ను 15 ఏళ్లపాటు ఒరేవా గ్రూప్‌నకు మోర్బీ మున్సిపాలిటీ అప్పగించింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఒరేవా గ్రూప్‌నకు చెందిన నలుగురు ఉద్యోగులు సహా 9 మందిని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఆదివారం కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయిన దుర్ఘటనలో 135 మంది మరణించారు. మచ్చూ నదిపై ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా నదిలో పడిపోయారు. అంతకుముందు.. వంతెనకు ఏడు నెలల పాటు మరమ్మతులు నిర్వహించారు. రిపేర్లు పూర్తై.. వంతెన తెరిచిన నాలుగోరోజే ఈ దుర్ఘటన జరిగింది.
