Montha Cyclone: మొంథా తుఫాను తీరం వైపు దూసుకొచ్చేస్తుంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఓడలరేవు – అంతర్వేది మధ్యలోని తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటబోతుంది తుఫాన్. అయితే తుఫాను ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి పూర్తి తీరం దాటే వరకు ఐదు గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఆ ఐదు గంటలే కీలకమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆ సమయంలో భీకర గాలులకు కరెంట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బ తినే అవకాశం అన్నట్టుగా చెప్తున్నారు.
మీ ఆరోగ్యం కోసం AI కోచ్.. సరికొత్త టెక్నాలజీతో వచ్చేసిన Google..!
కాబట్టి ఇలాంటి సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూన్నారు. ఇప్పటికే మొంథా తుఫాను ప్రభావంతో ఇటు కాకినాడ ఉప్పాడలో సముద్రం అల్ల కల్లోలంగా మారింది. రాకాసి అలలు ఎగసెగసి పడుతున్నటువంటి దృశ్యాలు అక్కడ కనపుతున్నాయి. ఇటు కాకినాడ, కోనసీమ జిల్లాలకు కూడా తీవ్ర తుఫాను ప్రభావం కనపడుతుంది. ఇకపోతే సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్లు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. చాలా పెనుగాలులు వీచే అవకాశం అన్నట్టుగా, అలాగే కోస్తా తీరం ఏదైతే ఉందో ఆ కోస్టల్ ప్రాంతాన్న అంతటిని కూడా బీభత్సము సృష్టించే అవకాశం ఉండనుందని అధికారులు చెప్తున్నారు.
CP CV Sajjanar : డీప్‌ఫేక్‌ల యుగంలో ‘సేఫ్ వర్డ్’ మీ భద్రతకు కవచం
ఇక మరోవైపు విశాఖ గాజువాకలో కూడా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. యారాడ కొండపై నుంచి బండరాళ్ళు కింద పడుతున్నాయి. ఎక్కడికక్కడ దూసుకొస్తూ ఉంది తుఫాను. భయానకంగా సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా కబలించేలా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాకినాడ తీరం దిశగా మొంత సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం దాలుస్తుంది. తుఫాను వైజాగ్ లో పలు ప్రాంతాలన్నీ అండర్ బ్రిడ్జ్లు అన్ని నీట మునిగాయి. దీనితో తీర ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు.
