Montha Cyclone: తెలంగాణపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. మొంథా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో భారీ.. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది.. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.. కొమరం భీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.. ఈరోజు అర్ధరాత్రి పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా.. రేపు ఆదిలాబాద్.. నిర్మల్.. జగిత్యాల.. మంచిర్యాల.. పెద్దపల్లి.. కరీంనగర్.. జయశంకర్ భూపాలపల్లి.. ములుగు.. వరంగల్.. మహబూబాబాద్.. భద్రాద్రి కొత్తగూడెం.. ఖమ్మం ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది..
READ MORE: Cyclone Montha: మొంథా తుఫాన్.. క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రి లోకేష్ ఆరా..
కాగా.. మొంథా తుఫాన్ క్రమంగా తీవ్ర రూపం దాల్చుతూ తీరం వైపు దూసుకొస్తుంది.. పెను తుఫాన్‌గా మారిపోయింది మొంథా తుఫాన్.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌కి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మొంథా పెను తుఫాన్‌గా మారిపో్యింది.. గత 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది.. తుఫాన్ ప్రస్తుతం.. మచిలీపట్నంకి దక్షిణ–ఆగ్నేయంగా 160 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకి దక్షిణ–ఆగ్నేయంగా 240 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకి దక్షిణ–దక్షిణ పశ్చిమంగా 320 కిలో మీటర్ల దూరంలో కేంద్రీ కృతమైంది.. ఇక, గోపాల్‌పూర్ (ఒడిశా) కి దక్షిణ–దక్షిణ పశ్చిమంగా 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మొంథా పెను తుఫాన్.. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడ పరిసర ప్రాంతాల్లో మొంథా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది.. తీర దాటే సమయానికి గాలివేగం గంటకు 90–100 కిలో మీటర్ల నుంచి గరిష్టంగా 110 కిలో మీటర్ల వరకు వీస్తుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు..
