NTV Telugu Site icon

NBK 109 : మాన్‌స్టర్‌ వచ్చేసాడు.. బాలయ్య బర్త్ డే గ్లింప్స్ అదిరిపోయిందిగా..

Nbk 109 (1)

Nbk 109 (1)

NBK 109 : నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” NBK 109 “..ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also :Y. V. S. Chowdary : హీరోగా ఎన్టీఆర్ ముని మనవడు..వైవిఎస్ చౌదరి బిగ్ అనౌన్స్మెంట్..

ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు బాబీ ఎంతో స్టైలిష్ గా చూపిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయినా గ్లింప్సె వీడియో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.బాలయ్య మాస్ డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసాయి.ఇదిలా ఉంటే నేడు (జూన్ 10 ) బాలయ్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ గ్లింప్సె రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.తాజాగా ఆ గ్లింప్సె వీడియో వచ్చేసింది.ఇక గ్లింప్స్ లో దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు.. వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ.. ఇలాంటి పదాల అర్ధమే తెలియని అసురుడు అనే డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ అదిరిపోతుంది.ప్రస్తుతం ఈ గింప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Show comments