Hyderabad Rain: హైదరాబాద్‌ను రుతుపవనాలు పలకరించాయి. మధ్యాహ్నం వరకు ఎండ కొట్టినా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో నగరంలోని పలుచోట్ల వర్షం పడుతుంది. నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, లక్డీ కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, ఈఎస్ఐ, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
Read Also: Crispy Fish Fry : చేపలను ఇలా ఫ్రై చేస్తే చాలు.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..!
మరోవైపు వర్షం దాటికి నగరంలో రోడ్లన్ని జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆఫీస్ నుంచి ఇళ్లకు వచ్చే సమయం కావడంతో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర వ్యాప్తంగా మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. ఇన్ని రోజులు ఎండ వేడికి ఉక్కిరి బిక్కిరి అయిన నగర వాసులు.. ఈ వర్షంతో కాస్త కూల్ అయ్యారు.
