టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పుడు ఆ హిందూ మైథాలాజీ కాన్సెప్ట్ హలీవుడ్ వరకూ వెళ్లింది. పురాణాల్లోని హనుమంతుడి పాత్ర స్ఫూర్తితో ఇప్పుడు ‘మంకీ మ్యాన్’ అనే ఇంగ్లీష్ సినిమాను తెరకెక్కించారు.’స్లమ్ డాగ్ మిలియనీర్’ ‘హోటల్ ముంబై’ ఫేమ్ దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంకీ మ్యాన్’. ఇందులో శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో తన ప్రతిభను చాటుకున్న శోభిత ఈ సినిమాతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో లేటెస్టుగా మరో ట్రైలర్ ను మేకర్స్ అవిష్కరించారు.
చిన్నతనంలోనే తల్లితో పాటుగా సర్వస్వం కోల్పోయిన హీరో.. ‘ధనవంతులు మమ్మల్ని మనుషులుగా కూడా చూడరు’ అంటూ తన గురించి చెప్పుకోవడంతో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ 2 ప్రారంభం అవుతుంది. పేద ప్రజలను కాపాడే వ్యక్తిగా తాను భావిస్తూ, హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ఫైట్ చేసే యువకుడి కథే ఈ సినిమా అని అర్థమవుతోంది. ఇందులో ఒక వెయిటర్ గా కనిపిస్తున్న దేవ్ పటేల్.. ఒక ఫైటర్ గా మారి తన తల్లి మరణానికి కారణమైన వ్యక్తిపై రివేంజ్ తీర్చుకోడానికి అతను ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.”రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ” అంటూ ఫస్ట్ ట్రైలర్ లోనే ‘మంకీ మ్యాన్’ కాన్సెప్ట్ ఏంటనేది వెల్లడించారు. ఇప్పుడు ట్రైలర్-2 లో “ఒక మనిషి దేవుడిని సవాలు చేస్తే.. అతను మనిషి కంటే ఎక్కువగా, మృగం కంటే ఎక్కువగా మారాలి” అని చెప్పడం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.అదిరిపోయే యాక్షన్ తో పాటుగా ఎమోషనల్ కంటెంట్ కలగలిపి వచ్చిన ‘మంకీ మ్యాన్’ రెండో ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
