NTV Telugu Site icon

Friday Money Tips: శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే.. కోటీశ్వరులు అవడం పక్కా!

Money Plant Remedies On Friday

Money Plant Remedies On Friday

Money Plant Remedies On Friday: ఇంట్లో సంపద, ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక చర్యలు ఇవ్వబడ్డాయి. అదే సమయంలో వాస్తు శాస్త్రంలో ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి అనేక మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలను ఇంట్లో సరైన దిశలో నాటినా లేదా పెట్టినా వ్యక్తి ఆదాయాన్ని పెంచుతాయి. ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటడం మీరు చాలా ఇళ్లలో చూసి ఉంటారు. అయితే మనీ ప్లాంట్ నాటితే సరిపోదు. దానికి సంబంధించిన కొన్ని విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ మొక్కకు సంబంధించి అనేక నియమాలు ఇవ్వబడ్డాయి. డబ్బులు రాకకు ప్రసిద్ధి అయిన ఈ మొక్కను సరైన దిశలో ఉంచడమే కాకుండా.. ప్రత్యేకంగా చూసుకోవాలని జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు అంటున్నారు. మీరు కూడా త్వరలో ధనవంతులు లేదా బిలియనీర్ కావాలనుకుంటే.. ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. శుక్రవారం రోజున మనీ ప్లాంట్‌కు చేయాల్సిన చర్యలు (Money Plant Friday Remedies) ఏంటో ఓసారి చూద్దాం.

వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ మొక్క సంపదకు సంబంధించినదని చెబుతారు. అదే సమయంలో లక్షిదేవి శుక్రవారంకు సంబంధించినది. అందుకే శుక్రవారం రోజున మనీ ప్లాంట్‌కు సంబంధించిన చర్యలు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. దాంతో సంపద మరియు శ్రేయస్సు మీ సొంతం అవుతాయి.

# మీరు ఇంట్లో మనీ ప్లాంట్ నాటాలనుకున్నా లేదా మార్చాలనుకున్నా శుక్రవారం ఉత్తమమైన రోజు. శుక్రవారం కొత్త మనీ ప్లాంట్‌ని ఇంటికి తీసుకొస్తే మంచిది. అది కూడా నర్సరీలో కొంటే మంచిది. దొంగిలించిన మనీ ప్లాంట్‌ను పొరపాటున కూడా నాటొద్దు.

# వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం మనీ ప్లాంట్‌ను ఆకుపచ్చ రంగు గాజు గిన్నెలో నాటండి. మట్టి కుండీలో కూడా నాటవచ్చు. అయితే పొరపాటున కూడా ప్లాస్టిక్ సీసా లేదా కుండలో నాటొద్దు.

Also Read: Bhola Shankar Twitter Review: భోళాశంకర్‌ ట్విట్టర్ రివ్యూ.. టాక్‌ ఎలా ఉందంటే?

# మనీ ప్లాంట్‌ను నాటడానికి ఇంటి ఆగ్నేయ దిశ మంచిదని చెబుతారు. ఈ దిశలో నాటడం వలన వ్యక్తి యొక్క ఆదాయం పెరుగుతుంది.

# బాల్కనీలో, పూజ గదిలో లేదా ఇంట్లోని ఏదైనా గదిలో మనీ ప్లాంట్‌ను నాటవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంటి బయట మాత్రం పెట్టొద్దట.

# శుక్రవారం స్నానం చేసిన తర్వాత మనీ ప్లాంట్‌కు ఎరుపు రంగు దారాన్ని కట్టాలి. ఇలా చేయడం ఫలవంతంగా ఉంటుంది.

# మనీ ప్లాంట్ యొక్క తీగ ఎల్లప్పుడూ పైకి ఉండాలి. మనీ ప్లాంట్ తీగ కిందికి పెరగడం అశుభం.

# ప్రతి శుక్రవారం నాడు లక్ష్మిదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్‌కు పచ్చి పాలను పోయాలి. దాంతో డబ్బు రాక వేగవంతం అవుతుంది.

Show comments