Maha Kumbh Mela Monalisa: మహాకుంభమేళా కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిసారి కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు వస్తారు. అలాగే ఈసారి కూడా ప్రయాగ్ రాజ్ లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి బారులు తీరుతున్నారు. ఈ మహాకుంభమేళాలో అఘోరీలు, నాగ సాధులు, ఋషులు ఇంకా దేశ, విదేశాల నుంచి పెద్దెత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉండగా ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతున్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఆమె ‘మోనాలిసా’. ఇండోర్‌కు చెందిన ఈ యువతి ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో తన సహజ అందంతో అందరిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మోనాలిసా సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్‌గా మారింది. ప్రస్తుత కుంభమేళలో ఆవిడకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్‌గా మారాయి.
Also Read: Amit Shah: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్.. నక్సలిజం చివరి దశలో ఉందని వెల్లడి!
ఇకపోతే తాజగా మహాకుంభమేళాలో కలకలం చోటు చేసుకుంది. పూసలమ్మే ఆ అమ్మాయిపై దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. అక్కడ కుంభమేళాకు వచ్చిన యువకులు మోనాలిసాతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దాంతో ఆ యువతిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు కుటుంబ సభ్యులు. బతకుదెరువు కోసం మధ్య ప్రదేశ్ నుంచి వచ్చిన మోనాలిసాను అక్కడి వారు ఇలా చేయడంతో ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా బతకుదెరువు కోసం వచ్చిన వారిని ఇలా చేస్తారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారికి సపోర్ట్ గా ఉండాలి కానీ ఇలా దారుణానికి పాల్గొనడం మంచిది కాదని కొందరు కామెంట్ చేస్తున్నారు.