NTV Telugu Site icon

Innocent Complaint: అమ్మ నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను జైల్లో పెట్టండి.. తల్లిపై బాలుడి ఫిర్యాదు

Innocent Complaint

Innocent Complaint

Innocent Complaint: చాక్లెట్లు, స్వీట్స్‌ తిననివ్వని తల్లిపై మూడేళ్ల చిన్నారి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ చిన్నారి తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తన చాక్లెట్లను దొంగించిందని, ఆమెను జైలులో పెట్టాలంటూ.. ఆ పిల్లవాడు ఒక మహిళా పోలీసు అధికారికి చెప్పాడు. ఆ బుడతడు తన తల్లిని మిఠాయిల కోసం వేధించినప్పుడు తనను కొడుతుందని కూడా క్యూట్‌గా చెప్పాడు. పిల్లల సమస్యలపై తీవ్రమైన శ్రద్ధ చూపుతున్నట్లు నటిస్తూ, ఆ పోలీసు అధికారి కూడా కేసు నమోదు చేస్తున్నట్లు జాగ్రత్తగా నటించింది. ఈ చిలిపి కేసు బుర్హాన్‌పూర్ జిల్లాలోని దేఢ్‌తలై గ్రామంలో వెలుగు చూసింది.

మధ్యప్రదేశ్‌లోని బుధన్‌పూర్‌ జిల్లాలో డెడ్తలై గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలుడు ఇటీవల తన తండ్రితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తనను చాక్లెట్లు తిననీయడం లేదని, తనను కొడుతోందని ఆ బుడతడు ఆరోపించాడు. ‘అమ్మ నా చాక్లెట్స్‌ దొంగిలించింది. ఆమెను జైలులో పెట్టండి’ అని అమాయకంగా ఫిర్యాదు చేశాడు. కాగా ఎస్సై ప్రియాంక నాయక్ కూడా ఫిర్యాదు రాస్తున్నట్లుగా ఆ చిన్నారిని నమ్మించారు. అనంతరం ఆ బాలుడికి మీ మమ్మీ చేసేందంతా నీ మంచి కోసమే అంటూ నచ్చజెప్పారు. మీ అమ్మ చాలా మంచిదని.. నువ్వంటే చాలా ఇష్టమని చెప్పి ఇంటికి పంపించింది. ఈ ఫిర్యాదుతో తామంతా నవ్వుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Free Cylinders: ఏడాదికి 2 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. గుజరాత్‌ మంత్రి కీలక ప్రకటన

ఇదిలా ఉండగా.. అసలు ఎందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చామో ఆ బాలుడి తండ్రి వివరించారు. తమ కుమారుడికి స్నానం చేయించిన తర్వాత అతడి తల్లి కాటుక పెడుతుండగా.. చాక్లెట్‌ కోసం మారం చేయడంతో ఆమె కొట్టిందని బాలుడి తండ్రి తెలిపాడు. దీంతో ఏడ్చిన అతడు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మారం చేయడంతో పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. కాగా, ఆ బుడతడు తన తల్లి గురించి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియో తిలకించిన నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.