SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి, ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోర్చుగల్‌లో జన్మించిన 39 ఏళ్ల హెన్రిక్స్, ఇటీవల తన జన్మభూమికి మారి ఆ దేశ జట్టులో చేరారు. ఈ నిర్ణయం ద్వారా ఆయన తన కెరీర్లో సరికొత్త మలుపు తిరిగారు. ఐసిసి పురుషుల టి20 వరల్డ్ కప్ యూరప్ సబ్-రీజినల్ క్వాలిఫైయర్ సి ఈవెంట్లో హెన్రిక్స్ పోర్చుగల్ తరఫున ఆడుతూ అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ఫిన్లాండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో చెకియాతో జరిగిన మ్యాచ్‌లో హెన్రిక్స్ తన అంతర్జాతీయ టి20 కెరీర్లో తొలి సెంచరీ సాధించారు. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి పోర్చుగల్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తుఫాన్ ఇన్నింగ్స్ తో పోర్చుగల్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి చెకియా జట్టు 8.5 ఓవర్లలో 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో డక్ వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం పోర్చుగల్ 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఈ విజయంతో పోర్చుగల్ ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నమెంట్లో హెన్రిక్స్ అద్భుత ఫామ్‌లో ఉంటూ మూడు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 178 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. హెన్రిక్స్‌తో పాటు పోర్చుగల్ బౌలర్ సెబాస్టియన్ క్రూజ్ డి ఒలివెరా కూడా నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచారు.
ఆస్ట్రేలియా తరఫున 2009 నుండి 2021 వరకు 11 టి20 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్ 135 పరుగులు చేసి 3 వికెట్లు తీశారు. అలాగే ఐపిఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు.. వివిధ జట్ల తరఫున 62 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఆయనకు ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పోర్చుగల్, గ్రూప్ ఎ లో నాలుగు విజయాలతో అజేయంగా ఉన్న స్పెయిన్‌తో శుక్రవారం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు 2028 టి20 వరల్డ్ కప్ ఆశలను సజీవంగా ఉంచుకుంటూ రీజినల్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!