NTV Telugu Site icon

Manchu Mohan Babu: నీకు, నీ భార్యకు సంబంధం ఏంటి.. మీడియాపై మోహన్ బాబు ఎదురుదాడి

Mohan Babu

Mohan Babu

Manchu Mohan Babu: మంచు కుటుంబంలో వివాదాలు నడుస్తున్నాయి అన్న విషయం అందరికి తెల్సిందే. ఈ మధ్య మంచు మనోజ్.. విష్ణు తన ఇంటికి వచ్చి దాడి చేసినట్లు వీడియో రిలీజ్ చేయడంతో వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లు స్పష్టం అయ్యింది. ఈ గొడవపై మంచు విష్ణు ఒకలా చెప్పుకొస్తే.. మనోజ్ ఇంకోలా చెప్పుకొచ్చాడు. చావనైనా చస్తాను కానీ అంటూ ఏవేవో కోట్స్ కూడా పెట్టుకురావడంతో ఈ వివాదం ఏదో గట్టిగా ముదిరినట్లు కనిపిస్తుందే అనుకున్నారు. ఇక కొడుకుల వివాదాలను బయటపెట్టకుండా మోహన్ బాబు వారిద్దరిని సమర్ధించుకొచ్చాడు. అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవా..? అంటూ చెప్పుకొచ్చాడు కానీ, ఆ గొడవలు ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇక అదంతా హంబక్.. గొడవ లేదు.. ఏమి లేదు.. మేమందరం రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నాం..ఆ ప్రమోషన్స్ కోసమే గొడవపడినట్లు చెప్పుకొచ్చిజనాలను పిచ్చోళ్లను చేశారు. సరే, జనాలను ఎంత పిచ్చోళ్లను చేసినా.. వారు అంత మైండ్ లేకుండా అయితే లేరు. ఆ గొడవ పడ్డ వీడియో బయటికి వచ్చిన దగ్గరనుంచి ఇప్పటివరకు విష్ణు, మనోజ్ కలిసి కనిపించలేదు. తండ్రితో కలిసి మనోజ్ ఉంటే విష్ణు ఉండడం లేదు. విష్ణు ఉంటే మనోజ్ కనిపించడు. దీంతోనే తెలిసిపోవడంలేదా.. అన్నదమ్ముల మధ్య ఏం జరుగుతుందో అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

Pushpa 2: వర్కింగ్ స్టిల్సే ఈ రేంజ్ లో ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా

ఇక తాజాగా ఈ ఇష్యూపై మోహన్ బాబును స్పందించమని కోరితే ఆయన, ఆయన చిన్న కొడుకు మనోజ్ మీడియాపై ఎదురుదాడికి దిగడం హాట్ టాపిక్ గా మారింది. నేడు ఈ తండ్రీకొడుకులు కలిసి తిరుపతిలోని ఒక హాస్పిటల్ ఓపెనింగ్ కు వచ్చారు. అక్కడ మీడియా ఈ గొడవ విషయం అడిగితే ..మనోజ్ ఏమో.. ” నాకు చిన్న సెగగడ్డ వచ్చిందండి. వచ్చి గోకుతారా?. అదే రీసెంట్ ఇష్యూ” అంటూ మీడియా ముందే వెకిలి చేష్టలు చేసి షాక్ ఇవ్వగా.. మోహన్ బాబు.. మీడియాపై రివర్స్ ఎటాక్ గా మాట్లాడిన తీరు ఆగ్రహం తెప్పిస్తోంది. “మీ ఇంట్లో నీ భార్యకు నీకు సంబంధం ఏంటో చెప్పగలవా? తప్పయ్యా.. చదువుకున్న విజ్ఞానులు మీరు. మీరందరూ నాకు ఇష్టం. ఎప్పుడు ఏది అడగాలో అది అడగాలి. సమయం, సందర్భం ఉండాలి. నేనొచ్చిన పనేంటి.. హాస్పిటల్ ఓపెనింగ్.. దాని గురించి అడగండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments