NTV Telugu Site icon

ICC Player Of The Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ద మంత్ రేసులో సిరాజ్, గిల్

Y

Y

ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉన్నారు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్. జట్టు విజయాల్లోనూ వీరిద్దరూ కీలకపాత్ర పోషిస్తున్నారు. గత నెలలో సిరాజ్‌, గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీంతో జనవరి నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఈ ఇద్దరినీ మంగళవారం (ఫిబ్రవరి 7) ఐసీసీ నామినేట్ చేసింది. వీరితో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ కాన్వే కూడా ఈ అవార్డు కోసం పోటీ పడనున్నాడు. కొత్త ఏడాదిని కాన్వే అద్భుతంగా ప్రారంభించాడు. అతడు అన్ని ఫార్మాట్లలో కలిపి జనవరిలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.

ఇక ఇండియన్ ప్లేయర్ గిల్ విషయానికి వస్తే 2022లోని తన టాప్ ఫామ్‌ను కొత్త ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు. మొదట శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అతడు 70, 21, 116 రన్స్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలోనే డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 149 బాల్స్ లోనే 208 రన్స్ చేయడం విశేషం. అదే సిరీస్‌లో తర్వాతి రెండు వన్డేల్లో 40, 112 స్కోర్లు చేసి ఔరా అనిపించాడు. తర్వాత కివీస్‌తో టీ20ల్లోనూ రెచ్చిపోయాడు. ఈ ఫార్మాట్‌కు పనికి రాడన్న విమర్శలకు చెక్ పెడుతూ చివరి మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేశాడు.

Also Read: INDvsAUS Tests: ద్రవిడ్ మాస్టర్ ప్లాన్..సూర్యకుమార్‌కు లైన్ క్లియర్!

కాగా, మహ్మద్ సిరాజ్ క్రమంగా ఇండియన్ టీమ్‌లో ప్రధాన బౌలర్‌గా ఎదుగుతున్నాడు. బుమ్రా లేని లోటును అతడు తీరుస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటికే నంబర్ వన్ ర్యాంకు కూడా అందుకున్నాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో అతడు మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు సాధించాడు. రెండో వన్డేలో ఆరు ఓవర్లు వేసి కేవలం 10 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

Also Read: OnePlus Launch Event: నేడే వన్‌ప్లస్ లాంచ్ ఈవెంట్.. లైవ్ ఎక్కడ చూడొచ్చంంటే!