Mohammed Siraj becomes World Number One ODI Bowler: హైదరాబాద్ గల్లీ బాయ్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. 2023 ఆసియా కప్‌లో 12.2 సగటుతో 10 వికెట్లు తీయడం (శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో ఆరు వికెట్లు) సిరాజ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది. సిరాజ్ ఖాతాలో ప్రస్తుతం 694 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు గత మార్చిలో సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు.
కొలంబోలో జరిగిన 2023 ఆసియా కప్‌లో శ్రీలంకపై మహ్మద్ సిరాజ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో నాలుగు వికెట్స్ తీయడంతో పాటు మొత్తంగా 6 వికెట్స్ (6/21-7 ఓవర్లు) పడగొట్టాడు. ఈ ప్రదర్శన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకేలా చేసింది. దాంతో స్టార్ పేసర్లు జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, మిచెల్ స్టార్క్‌లను అధిగమించి టాప్‌లోకి దూసుకొచ్చాడు. హేజిల్‌వుడ్, బౌల్ట్ 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. టాప్ 10లో 638 రేటింగ్ పాయింట్లతో కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో ఉన్నాడు.
Also Read: ICC World Cup 2023: ప్రపంచకప్ ఆఫీషియల్ సాంగ్ వచ్చేసింది.. సందడి చేసిన రణ్‌వీర్, చహల్ సతీమణి!
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్ ఖాతాలో 857 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 814 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (708) ఎనిమిదో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (696) పదవ స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ జాబితాలో షకీబ్ ఉల్ హాసన్ (371) టాప్‌లో ఉన్నాడు. టాప్ 10లో భారత్ నుంచి హార్దిక్ పాండ్యా (243) ఆరో స్థానములో ఉన్నాడు.
Top of the world 🔝
India’s ace pacer reigns supreme atop the @MRFWorldwide ICC Men’s ODI Bowler Rankings 😲
— ICC (@ICC) September 20, 2023
