Site icon NTV Telugu

Mohammed Shami: మహ్మద్‌ షమీకి హత్య బెదిరింపులు!

Mohammed Shami Suicide

Mohammed Shami Suicide

భారత పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా హత్య బెదిరింపులు పంపిన దుండగులు.. రూ.కోటి డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని షమీ సోదరుడు హసీబ్ సోమవారం ఓ జాతీయ మీడియాకు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మెయిల్ వచ్చిందని, వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం అని వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్‌పుత్ సిందార్‌ అనే వ్యక్తి మెయిల్‌ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌కు కూడా బెదిరింపులు వచ్చాయి. ‘ఐ కిల్‌ యూ’ అంటూ ఈ-మెయిల్స్‌ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు గౌతీ ఫిర్యాదు చేశాడు.

Also Read: Gudivada Amarnath: 11వేల కోట్ల స్కాం జరిగింది.. కూటమి ప్రభుత్వ మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం!

2023 ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా మహ్మద్ షమీ టీమిండియాకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స తర్వాత చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకుని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి.. ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్‌ షమీ ప్రదర్శన నిరాశపరిచింది. 9 మ్యాచ్‌ల్లో 56.17 సగటుతో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

Exit mobile version