Site icon NTV Telugu

Mohammed Shami : బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరితో షమి

Shami&preethi

Shami&preethi

చివరి ఓవర్ థ్రిల్లర్ లు.. బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగుతున్న ఐపీఎల్-16లో ఆటలో ఎలా ఉన్నా.. గేమ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లంతా ఒకచోటుకు చేరి కబుర్లు చెప్పుకుంటుండటం చూస్తూనే ఉన్నాం. ఇది ఫ్రెండ్లీ గమ్ కు స్పూర్తి. అయితే నిన్న పంజాబ్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఓ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ ఫోటోలో గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ.. బాలీవుడ్ సొట్టబుగ్గల సందరీ-పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాలు చిరు నవ్వులు చిందించారు. ఉత్కంఠభరితంగా ముగిసిన ఈ మ్యాచ్ లో గుజరాత్ మరో బంతి మిగిలి ఉండగానే 154 పరుగుల టార్గెట్ ను అందుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే షమీ.. ప్రీతి జింటాతో కలిసి కాసేపు మాట్లాడాడు. ఇద్దరూ మనసారా నవ్వుతుండటంతో ఫ్యాన్స్ ఈ ఫోటోకు కొత్త అర్థలు చెబుతున్నారు.

Read Also : Vande Bharath: తెలంగాణకు మరో రెండు వందే భారత్ రైళ్లు..?

ఈ నవ్వులు కొత్త బంధానికి దారితీస్తాయా.. అని నెటిజన్ కామెంట్ చేస్తే మగాళ్ల హృదయాలు కొల్లగొట్టడంతో ప్రీతి జింటా స్టైలే వేరు.. మరో ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు. ఇక తెలుగు ట్రోల్ పేజీలలో అయితే జాతిరత్నాలు సినిమాలో ఇద్దరు టీచర్లు మాట్లాడుకుంటుండగా నవీన్ పొలిశెట్టి అండ్ గ్యాంగ్ అల్లరి చేసే మీమ్ తో పాటు వెంకీ సినిమాలో రవితేజను చిత్రం శ్రీను.. శ్రీనివాస్ రెడ్డిలు ఆటపట్టించే మీమ్స్ తో అలరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, మీమ్స్ ఇప్పుడు యూజర్లను అలరిస్తున్నాయి. ఈ ఫోటో వైరల్ అయ్యాక ట్విట్టర్ లో #Shamita ( షమీ-ప్రీతిజింటా) కూడా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 154 పరుగుుల చేసి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

Read Also : Covid-Like Pandemic: మరో 10 ఏళ్లలో కోవిడ్ వంటి మరో మహమ్మారి వచ్చే అవకాశం..

Exit mobile version