World Cup 2027: ఆ కాటేరమ్మ కొడుకు అంటే గంభీర్‌కు ఎంతో ఇష్టం.. వరల్డ్ కప్‌లో స్థానం పక్కా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ-20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ హడావుడి ముగియడంతో క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచకప్ ఎంపికలపై పడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఫీల్డర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచకప్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే ప్రశ్నకు కైఫ్ ఎటువంటి సంకోచం లేకుండా కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపారు.
కేఎల్ రాహుల్‌కే మొదటి ప్రాధాన్యత..
మహమ్మద్ కైఫ్ అభిప్రాయం ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా వన్డేల్లో కేఎల్ రాహుల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. వన్డే క్రికెట్లో రాహుల్ 50 సగటు కలిగి ఉన్నాడని, నంబర్ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్‌లను ముగించడం అంత సులువు కాదని ఆయన పేర్కొన్నారు. కెరీర్లో ఎన్నో విమర్శలు, ట్రాన్స్ఫర్లు, కెప్టెన్సీ మార్పులు చూసిన తర్వాత రాహుల్ ఎంతో పరిణతి చెందాడని కైఫ్ కొనియాడారు. కీపింగ్, స్లిప్ ఫీల్డింగ్, అవసరమైతే కెప్టెన్సీ చేయగల సామర్థ్యం రాహుల్‌కు అదనపు బలాలు.
Also Read
- OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
అయితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనస్తత్వాన్ని కూడా కైఫ్ ప్రస్తావించారు. గంభీర్‌కు ఇషాన్ కిషన్ అంటే చాలా ఇష్టమని, ఈ సమీకరణం భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా లైవ్ షోలో గంభీర్.. రాహుల్ కంటే ఇషాన్ కిషన్‌కే ప్రాధాన్యత ఇచ్చారని కైఫ్ గుర్తు చేశారు. ప్రస్తుతానికైతే నంబర్ 6 స్థానంలో నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ స్థానం సురక్షితంగా ఉంటుందని, ఒకవేళ రాహుల్ ఫామ్ కోల్పోతే గంభీర్ ఇష్టపడే ఇషాన్ కిషన్‌కు త్వరగానే అవకాశం దక్కుతుందని కైఫ్ విశ్లేషించారు. అయితే, ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చినా విరాట్ కోహ్లీ స్థానమైన నంబర్ 3లో మాత్రం ఆడలేరని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!