Site icon NTV Telugu

Moeen Ali Retirement: మొయిన్ అలీ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. ఈసారి వెనక్కి తీసుకోనంటూ పోస్ట్!

Moeen Ali Retirement

Moeen Ali Retirement

Moeen Ali Retirement: ఇంగ్లండ్ సీనియర్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ స్క్వాడ్‌ నుంచి త‌ప్పుకున్న అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. అలీ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుండి రెండుసార్లు రిటైర్ అయ్యి.. తన నిర్ణయాన్ని వెనక్కితీసున్నాడు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలీ.. ఈసారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని చెప్పాడు.

ఇప్ప‌టికీ తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, ఇంగ్లండ్ జ‌ట్టులో యువ ఆట‌గాళ్ల‌కు ఛాన్స్ ఇచ్చేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మొయిన్ అలీ తెలిపాడు. డైలీ మెయిల్‌లో నాజర్ హుస్సేన్‌తో అలీ మాట్లాడుతూ… ‘అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నా. నేను పట్టుబట్టి మళ్లీ ఇంగ్లండ్‌కు ఆడటానికి ప్రయత్నించగలను. కానీ వాస్తవానికి నేను ఆడనని నాకు తెలుసు. మ‌ళ్లీ నా నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌ను. రిటైర్మెంట్ ప్ర‌క‌టించడానికి నా ఫిట్‌నెస్ కార‌ణం కాదు. ఇప్ప‌టికీ నేను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా. ఇంగ్లండ్ జ‌ట్టులో యువ ఆట‌గాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు నేను త‌ప్పుకుంటున్నా. ఇంగ్లండ్ క్రికెట్‌లోకి కొత్తత‌రం ఆట‌గాళ్లు రావాలి’ అని అన్నాడు.

Also Read: Deepthi Jeevanji: పారాలింపిక్స్‌ కాంస్య పతక విజేత దీప్తికి సీఎం రేవంత్‌ రెడ్డి భారీ నజరానా!

ఇంగ్లండ్ త‌ర‌పున 68 టెస్టులు, 138 వ‌న్డేలు, 92 టీ20లు ఆడిన మొయిన్ అలీ.. టెస్టుల్లో 3094, వ‌న్డేల్లో 2355, టీ20ల్లో 1229 ప‌రుగులు చేశాడు. మూడు ఫార్మాట్లు క‌లిపి 366 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తన ఆఫ్ స్పిన్‌తో అలీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టాడు. ఇందులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో మొత్తం 10 సార్లు అవుట్ చేశాడు. ఇంట‌ర్న‌నేష‌న‌ల్ క్రికెట్ నుంచి త‌ప్పుకున్న అలీ.. ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడ‌నున్నాడు.

 

Exit mobile version