Modi Trump Meeting: అగ్రరాజ్యాధినేతగా, తన దూకుడైన నిర్ణయాలతో సంచనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కళ్లెం వేస్తారా. ప్రపంచమంతా ఈ ఇరువురి సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇంతకీ మోడీ – ట్రంప్ మీటింగ్ ఎక్కడ ఉండనుందో తెలుసా.. ఒక వేళ వాళ్లు కలిస్తే ఏయే అంశాలపై ప్రధానంగా చర్చ జరగవచ్చు అనేది ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతుంది. అగ్రరాజ్యాధినేత, భారత ప్రధాని మీటింగ్ స్పాట్‌గా మలేషియా నిలువనుంది. ఈ దేశంలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ – ట్రంప్ మీటింగ్ ఉండనున్నట్లు సమాచారం.
READ ALSO: Bigg Boss : రీతూ చౌదరికి భారీ షాక్ ఇవ్వనున్న నాగార్జున..?
అక్టోబర్ 26 నుంచి 28 వరకు సమావేశం..
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఈ సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది. భారతదేశం – అమెరికా సంబంధాలను పునరుద్ధరించడానికి ఈ ఇద్దరు నాయకులు సమావేశం కావచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మలేషియా ప్రధాన మంత్రి దాతుక్ సెరి అన్వర్ ఇబ్రహీం వచ్చే నెలలో కౌలాలంపూర్‌లో జరగనున్న 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మలేషియాకు వస్తారని ధృవీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొనడానికి సన్నాహాలు జరుగుతున్నాయని భారతదేశ వర్గాలు చెబుతున్నాయి. సుంకాల నుంచి H1-B వీసాల వరకు రెండు దేశాల మధ్య ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది.
మోడీ బర్త్ డేకి ట్రంప్ ఫోన్ కాల్..
అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన తర్వాత తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో ఇరు దేశాల నాయకులు భారతదేశం – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదం గురించి కూడా చర్చించారు. భారత వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలను విధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడి నుంచి వచ్చిన ఈ ఫోన్ కాల్ ఇరుదేశాల దౌత్య సంబంధాలలో గణనీయమైన మార్పును తెచ్చాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ కీలకమైన యూరోపియన్ నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే నెలలో మలేషియాలో జరగనున్న సమావేశంలో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.
READ ALSO: Manchu Manoj : సినిమా యుద్ధంలో గెలిచి విజయం సాధించా.. నా కల నెరవేరింది!
