PIB Fact Check: కేంద్ర ప్రభుత్వం “బెరోజ్‌గరి భట్ట యోజన 2025” అనే పథకం కింద నిరుద్యోగ యువత అందరికీ నెలకు రూ.2,500 అందిస్తున్నట్లు “PhleDekhoPhleSikho” అనే యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈక్రమంలో చాలా మంది యువత ఈ కేంద్ర పథకం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందా? లేదా అనేది తాజా PIB ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.
READ ALSO: Chiranjeevi Fans : చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాం కానీ మా పోరాటం ఆగదు!
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌లో ఏం తేలిందంటే?
ప్రధాన మంత్రి ‘బెరోజ్‌గర్ భట్టా యోజన’ కింద నెలకు రూ.2,500 అందిస్తున్నట్లు పేర్కొంటూ మీకు ఏమైనా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిందా? దీనిపై తాజాగా PIB ఎక్స్‌లో స్పందించింది. భారత ప్రభుత్వం అలాంటి పథకాన్ని నిర్వహించడం లేదని పీఐబీ ఒక పోస్ట్‌లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులందరికీ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను అందిస్తున్నారనే ప్రచారాన్ని కూడా PIB తప్పుడు సమాచారం అని చెప్పింది. ఇటువంటి తప్పుడు సమాచారం నుంచి తప్పించుకోవడానికి, పౌరులు నవీకరణల కోసం PIB లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌ల వంటి అధికారిక వనరులపై ఆధారపడాలని వెల్లడించింది.
తాజాగా యూట్యూబ్‌లో వెలుగు చూసిన కేంద్ర ప్రభుత్వం వాదన పూర్తిగా నకిలీదని, దీనికి ఎటువంటి ఆధారం లేదని పేర్కొంది. గతంలో భారత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రూ.3,500 ఇస్తున్నట్లు పేర్కొంటూ ఒక వాట్సాప్ సందేశం సైతం వైరల్ అయిందని.. దేశ ప్రజలందరికీ తప్పుడు సమాచారం నుంచి బయటపడటానికి పీఐబీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను చూడాలని సూచించింది.
READ ALSO: India Jihadi Network: భారత్‌లో జిహాదీ నెట్‌వర్క్.. భారీ ప్లాన్‌ను భగ్నం చేసిన ఏటీఎస్!
दावा: " बेरोजागरी भत्ता योजना " के तहत बेरोजगार युवाओं को प्रतिमाह ₹2500 दिए जाएंगे। #PIBFactCheck
❌ #Youtube चैनल "PhleDekhoPhleSikho" के वीडियो में किया जा रहा यह दावा #फर्जी है।
🔹 केंद्र सरकार से संबंधित किसी भी प्रकार की संदिग्ध तस्वीरें, वीडियो अथवा संदेश… pic.twitter.com/suDGG1SjcE
— PIB Fact Check (@PIBFactCheck) September 29, 2025
