Site icon NTV Telugu

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌ నామినేషన్‌.. హాజరైన సీఎం స్టాలిన్!

Kamal Haasan

Kamal Haasan

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభ సీటుకు నామినేషన్‌ దాఖలు చేశారు. కమల్‌ హాసన్‌ నామినేషన్‌ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ హాజరయ్యారు. జూన్ 4నే నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉండగా.. ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై లోకనాయకుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది పీ విల్సన్, తమిళ రచయిత రోకియా మాలిక్ అలియాస్ సల్మా, మాజీ ఎమ్మెల్యే శివలింగం కూడా సీఎం స్టాలిన్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.

తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికైన అన్బుమణి రామదాస్ (పీఎంకే), ఎన్ చంద్రశేఖరన్ (ఏఐఏడీఎంకే), ఎం షణ్ముగం, మహ్మద్ అబ్దుల్లా, పీ విల్సన్, వైకోల పదవీ కాలం జూన్ 24‌తో ముగియనుంది. ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 19న ఎన్నికకు డేట్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో డీఎంకే తరఫున పీ విల్సన్‌, ఎస్ఆర్ శివలింగం, రచయిత్రి సల్మాతో పాటు ఎంఎన్‌ఎం పార్టీ చీఫ్ కమల్‌ హాసన్‌ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు.

Also Read: Covid 19 Update: 498 కొత్త కరోనా కేసులు.. నలుగురు మృతి!

కమల్‌ హాసన్‌ 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించారు. ఇండియా కూటమిలో ఇది భాగం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఎంఎన్‌ఎంకు ఎగువసభ స్థానం కేటాయించారు. నేడు కమల్‌ హాసన్‌ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు.

Exit mobile version