Site icon NTV Telugu

MLC Vijayashanti: గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ కాదు.. గుండెపై చేయి వేసి ‘జై తెలంగాణ’ అనండి!

Vijayashanti

Vijayashanti

MLC Vijayashanti offering bonam to Borabanda goddess: హైదరాబాద్ నగరంలోని బోరబండలో ఆషాఢ బోనాలు ఘనంగా సాగుతున్నాయి. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హాజరై.. అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడారు. తెలంగాణను దోచుకోవడానికి మరలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ నాశనం కోరుకుంటున్న వారికి వినాశనం తప్పదని హెచ్చరించారు.

Also Read: Ponnam Prabhakar: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా!

‘తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రం బంగారు బాతు. బంగారు బాతును విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలోకి వచ్చి మనల్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వారిని ఎదురించాలి. రాష్ట్రంలోకి వస్తున్న శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణను దోచుకోవడానికి మరలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ నాశనం కోరుకుంటున్న వారికి వినాశనం తప్పదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ కాదు.. పిడికిలి బిగించి గుండెపై చేయి వేసి జై తెలంగాణ అనండి. తెలంగాణ ప్రజల గుండెల్లోనే తెలంగాణ ఉంది, ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడూ జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం. ఏ ఎన్నిక వచ్చినా బాబా ఫసీయుద్దీన్ కుటుంబం గెలవాలని కోరుకుంటున్నా’అని ఎమ్మెల్సీ విజయశాంతి చెప్పారు.

Exit mobile version