NTV Telugu Site icon

Shaik Sabjee Dies: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి!

Mlc Shaik Sabjee

Mlc Shaik Sabjee

MLC Shaik Sabjee Dead: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీకి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందగా.. సీసీకి గాయాలయ్యాయి. గన్‌మెన్‌కి కూడా గాయాలు కాగా.. భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెసులుస్తోంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకున్నారు.

Show comments