Lella Appi Reddy: దేశం గర్వంగా చెప్పుకునే వ్యక్తి జ్యోతిరావు ఫూలే.. ఆయన ఆశయాలు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి.. ఈ రోజు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు.. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, గంజి చిరంజీవి, పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పూలే విధానాలు అమలు కావాలి అంటే మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ రావాలన్నారు. బీసీల అభివృద్ధి కోసం పాటుపడిన స్వతంత్ర సమరయోధుడు పూలే అని పేర్కొన్న ఆయన.. రాష్ట్రంలోని ఎంపీ, ఎమ్మెల్యే 200 స్థానాల్లో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కలపి వంద స్థానాలు ఇచ్చిన వ్యక్తి జగన్ మాత్రమే అన్నారు. పేదలకి సంక్షేమ పథకాలతో పాటు బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని ప్రశంసలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు వైసీపీ గెలవాలని కోరుకుంటున్నాను అన్నారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి.
Read Also: Rajamouli-Rama Dance: ఆల్‌టైమ్ హిట్ పాటకు రాజమౌళి, రమ డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్!
