స్త్రీ శక్తి విజయానికి సూచిక విజయ దశమి అని.. మహిళా జయానికి ప్రతిబింబమని.. దసరా పండుగ అంటే.. మహిళల విజయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ,ఎమ్మేల్యే గణేష్ గుప్తాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండగ అంటే మహిళల విజయమని, 9 రోజుల పాటు బతుకమ్మ పండగ నంగా జరుపుకున్నామన్నారు.
Also Read : Sampoornesh Babu: నాకు వర్క్ షాప్ ఏంటి అనుకున్నా.. ఎప్పుడో నేర్చుకున్న నటనను మళ్ళీ గుర్తు చేశారు!
సద్దుల బతుకమ్మ సోలపూర్ లో జరపటం సంతోషాన్ని ఇచ్చిందని, బతుకమ్మ పాట వలే శ్రీరాముని పాట కూడా చేశామన్నారు. ఈరోజు ఖిల్లా రామాలయంలో ఈ పాటను ఆవిష్కరించామని, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పండుగలు వైభవంగా జరుపు కుంటారన్నారు. ఇది తెలంగాణకే గర్వకారణమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే పండగలు వైభవంగా జరుగుతాయని, చెడును తగ్గించి మంచి గుణాలను పెంపొందించుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రజలకు మంచి చేసే వారికి సమున్నత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : Alaska Airlines: ఆకాశంలో ఆగమాగం.. గాల్లో ఉన్న విమానం ఇంజన్ ఆపేందుకు ప్రయత్నించిన పైలెట్ అరెస్ట్
