Site icon NTV Telugu

MLC Kavitha: నోటిఫికేషన్ నాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు..

Mlc Kavitha Vs Harish Rao

Mlc Kavitha Vs Harish Rao

MLC Kavitha: గ్రూప్-1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చాలా కార్యక్రమాలు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 15 తారీఖున డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. గ్రూప్1 నియామకాలపై సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో అనంతరం మీడియాతో మాట్లాడారు. అందుకే 15 వరకు కార్యక్రమాలు తీసుకుందామని నిర్ణయించినట్లు చెప్పారు. నిన్న విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి వారి సాక్షిగా పోరాటం ప్రారంభించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపేందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ -1 విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు జరిగాయన్నారు. ఆ తప్పులను తాను మండలిలో కూడా ఎత్తి చూపినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ తప్పులను ఎండగట్టాల్సిన అవసరముందని సూచించారు.

READ MORE: రోడ్డుమార్గాన నర్సీపట్నానికి జగన్, పోలీసులు నిర్దేశించిన అనకాపల్లి,పెందుర్తి మీదుగా పర్యటన

ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టటంలో మీడియా, సోషల్ మీడియా చాలా సహకరిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. వారి ఒత్తిడి కారణంగానైనా ప్రభుత్వం కొంచెమైనా బుద్ది తెచ్చుకోవాలి. ఇప్పడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు రద్దు చేసి…మళ్లీ రీ ఎగ్జామ్ పెడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశం చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు, సీఎంకు పంపిద్దామన్నారు.
తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు జాగృతి భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు.

READ MORE: ‘Dude’ Trailer : ప్రదీప్ ‘డ్యూడ్’ ట్రైలర్ రిలీజ్.. చూస్తుంటే మళ్ళీ హిట్ కొట్టేలా ఉన్నాడే

Exit mobile version