Site icon NTV Telugu

MLA Somireddy: వైఎస్ జగన్‌కు ఆ అర్హత ఉందా?.. కాకాణి పాపాలు రెండు రోజుల్లో బయటపెడతా!

Mla Somireddy

Mla Somireddy

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసే అర్హత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఉందా? అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు, అయన బాగోతం రెండు రోజుల్లో బయటపెడతా అని హెచ్చరించారు. మాజీ మంత్రి కాకాణి వల్ల ఎంతో మంది అధికారులు సస్పెండ్ అయ్యారని, అప్పటి వైసీపీ ఎంపీ మాగుంట సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని పేర్కొన్నారు. జగన్‌ వల్ల ఎంతో మంది జైలుకు వెళ్లారని, వాళ్లని పరామర్శించకుండా నెల్లూరుకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. కాకాణి పాపాలకి బలైన వారిని కూడా జగన్ పరామర్శించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు.

‘మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాపాలకి బలైన వారిని కూడా వైఎస్ జగన్ పరామర్శించాలి. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన వారిని కూడా జగన్ పరామర్శించాలి. 4వేల అట్ట పెట్టేల్లో 3700 కోట్ల డబ్బులు ట్రాన్స్‌పోర్ట్‌ అయ్యాయి. ఇంత పెద్ద లిక్కర్ స్కామ్‌కి ప్రధాన కారణం జగన్. జగన్ వల్ల 40 మంది జైలుకు వెళ్లారు. ఎన్నికల సమయంలో ఎవరెవరికి ఎంత డబ్బులు వెళ్లాయనేది పోలీసుల దగ్గర సమాచారం ఉంది. ఫామ్ హౌస్‌లో లిక్కర్ స్కామ్‌కి చెందిన 11 కోట్లను సిట్ సీజ్ చేశారు. జగన్ పరామర్శ తరువాత సినిమా చూపిస్తా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి, ధనుంజయ్‌ రెడ్డి.. ఎంతో మంది జగన్‌ మాట విని జైలుపాలయ్యారు. వారి నివాసలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కూడా జగన్ పరామర్శించాలి’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు.

Also Read: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడం.. మరోసారి బాంబ్ పేల్చిన భారత ఆటగాళ్లు!

‘మిగతా వారి కుటుంబ సభ్యులను పరామర్శించకుండా కాకాణినే ఎందుకు పరామర్శించడానికి వైఎస్ జగన్ వస్తున్నారు?. పాపాలు చేసిన వారిని అరెస్టు చేస్తే చూడటానికి వస్తున్నారు. పాపాలు చేసిన వైఎస్ జగన్.. భార్యతో కలిసి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ని కలిసే అర్హత ఉందా?. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటం వల్లే పోలీసులు ఆంక్షలు పెట్టారు. నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న కాకాణి అంత మంచివాడా?. మాజీ మంత్రి కాకాణి చేసిన పాపాలు, అయన బాగోతం రెండు రోజుల్లో బయటపెడతా. గురువారం నెల్లూరులో జగన్‌ పర్యటన తర్వాత శుక్రవారం కాకాణి దుర్మార్గాలను బయటపెడతా. మాజీ మంత్రి కాకాణి వల్ల ఎంతో మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. అప్పటి వైసీపీ ఎంపీ మాగుంట సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చెప్పారు.

Exit mobile version