Site icon NTV Telugu

చంద్రబాబు ఫ్రస్టేషన్ లో ఉన్నాడు… రోజా ఫైర్‌

RK Roja

RK Roja

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ లో వున్నాడని…చురకలు అంటించారు ఎమ్మెల్యే ఆర్. కె రోజా. ఇవాళ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. నిన్న పండగ పూట ఎన్నిక లేంటి అని అంటున్నాడని… ముఖ్యమంత్రి జగన్ కు ఎన్నికల కమిషన్ కు సంబంధం ఏమిటి ? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నపుడు అన్ని నచ్చాయని… ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషనర్ నిర్ణయాలు తప్పులు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడని ఆగ్రహించారు రోజా. ఇప్పుడు జగనన్న పరిపాలన, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక పోతున్నాడని నిప్పులు చెరిగారు. ఏ ఎలక్షన్ ఎప్పుడూ వచ్చినా వైసీపీకే ప్రజలు పట్టంకడుతున్నారన్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు బాధ్యత గల ప్రతిపక్షంగా ఉంటే మంచిదని సూచించారు రోజా..

Exit mobile version