NTV Telugu Site icon

Galib Shahid Darga Metla Baavi: గాలిబ్ షాహిద్ దర్గా మెట్లబావికి ఇక మహర్దశ

Rachakonda 1

Rachakonda 1

భావితరాలకు చారితాత్మక పురాతన కట్టడాలను అందించాలని దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ ప్రాంతంలో గాలిబ్ షాహిద్ దర్గా వద్ద గల పురాతన మెట్ల భావిని పురాతన ఆలయాలను సందర్శించి పునర్నిర్మాణం చేపడతామని తెలిపిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆయనతోపాటు యాదాద్రి జిల్లా పమేల సత్పతి,అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Read Also: VasalaMarri Deveopment: సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిపై అధికారుల నజర్

మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వారికి అభివృద్ధిని అందిస్తానన్నారు. తెలంగాణ సంపాదించుకోవడం ద్వారా చారిత్రక కట్టడాలను పురాతన మెట్ల భావాలను ప్రత్యేక గుర్తింపు తేవాలని ప్రభుత్వ భావిస్తోందన్నారు. ఆ ఉద్దేశంతో రాచకొండ ప్రాంతంలోని గాలిబ్ షాహిద్ షా దగ్గర ఉన్న మెట్ల బావిని పునరుద్ధరించడానికి 30 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ముందుకొచ్చిందని ఎమ్మెల్యే చెప్పారు. అతి త్వరలో ఈ పనులు చేపడతామన్నారు.

అలాగే స్వయంభు శివలింగాన్ని పాత శివాలయంలో పీఠాధిపతుల సమక్షంలో పున ప్రతిష్ట చేస్తామన్నారు. దేవాదాయ శాఖ చేయూతతో రాచకొండ ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా మారుస్తాం అన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు తో మునుగోడును అభివృద్ధి చేస్తాం అన్నారు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఇటీవల సికింద్రాబాద్ లో పురాతన మెట్ల బావిని పునర్నిర్మించింది ప్రభుత్వం. అదే తరహాలో పురాతన మెట్ల బావుల్ని గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. సికింద్రాబాద్ సమీపంలోని బ‌న్సీలాల్‌పేట్ మెట్ల బావిని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి ఈనెల 5వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read Also: Today (20-12-22) Stock Market Roundup: లాభం ఒక్క రోజు ముచ్చట. ఇవాళ మొత్తం నష్టాల బాట