Site icon NTV Telugu

MLA Padmavathi: టీడీపీ నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది.. ఎమ్మెల్యే యూటర్న్

Padmavathi

Padmavathi

MLA Padmavathi: శింగనమల ఎమ్మెల్యే పద్మావతి యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది పద్మావతి తెలిపారు. హైకమాండ్ ఆదేశాలతో పద్మావతి మీడియాకు వివరణ ఇచ్చారు. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ అవ్వడంతో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

Read Also: Bhuma Akhila Priya: అన్ని లెక్క రాసుకుంటున్నాం.. ఎవరిని వదిలిపెట్టేది లేదు..

కాగా.. ఈ వ్యవహారంపై సీఎం జగన్ తో తన వ్యాఖ్యల పై సీఎంకు వివరణ ఇచ్చారు పద్మావతి. తాను మాట్లాడిన మాటలు కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయన్నారు. తాను ఎవరిని ప్రశ్నించానో.. ఆ మీడియా సంస్థలు చెప్పాలని తెలిపారు. ప్రతి చిన్న విషయానికి సీఎం కార్యాలయానికి వెళ్ళాలి అనే బాధ ఉంది.. ప్రతిసారి సీఎంఓ వరకు రావాల్సి ఉందని ఫేస్ బుక్ లైవ్ లో చెప్పానన్నారు. అధికారులు కూడా ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. తన మాటలు వక్రీకరించి.. తాను సీఎం జగన్ ను వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం చేశారని పద్మావతి పేర్కొన్నారు. ప్రజల కోసం జగన్ చెప్పిన పని చెయ్యడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మంత్రి అయిపోవాలనే ఆలోచన ఏదీ లేదు. ఇప్పటికిప్పుడు సీఎం జగన్ నన్ను నువ్వు పక్కన ఉండు అంటే ఆయన నిర్ణయానికి అంగీకరిస్తా” అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తేల్చి చెప్పారు.

Read Also: Mamata Banerjee: రామమందిర ప్రారంభోత్సవం ఈవెంట్‌ ఓ జిమ్మిక్‌ షో..

Exit mobile version