జడ్చర్ల మున్సిపల్ పరిధి లోని 17వ వార్డు కు చెందిన యూత్ కాంగ్రెస్ సభ్యులు శ్రీమతిన్ తో పాటు 60 మంది మైనారిటీ సోదరులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలోనే తమకు గౌరవం దక్కిందని, మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభించి వేల మంది మైనారిటీ పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందిస్తున్నారని అన్నారు. పేద ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా అదుకునేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ వైపే మేము ఉంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుండి లబ్ది చేకురిందని అన్నారు.
Also Read : Pentagon Report: భారత సరిహద్దుల్లో పెరిగిన చైనా సైనిక ఉనికి.. 500కు పైగా న్యూక్లియర్ వార్‌హెడ్స్..
మంచి చేసే ప్రభుత్వనికి అండగా ఉండాలని కోరారు. ఈ సారి ఎన్నికల్లో లక్ష మెజారిటీ సాధించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కృషి చేయాలని కోరారు. పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, వ్యవసాయంపై ఆధారపడి జీవించే కులవృత్తుల వారికి సైతం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టు పనులకు ని రంతరం ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు అడ్డుకునేందుకు యత్నించినా వాటిన్నింటినీ ఎదుర్కొ ని పూర్తి చేస్తున్నామ ని చెప్పారు. అదేవిధంగా జడ్చర్ల పట్టణంలో జనాభా 40 వేల నుంచి లక్షకుపైగా చేరిందని, దాంతో పట్టణం నలువైపులా విస్తరించిందన్నారు.
Also Read : Nara Lokesh: చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరాను సెలబ్రేట్ చేసుకుందాం..