రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్‌లో మొదలైన పరిచయం క్రమంగా బెదిరింపులు, వేధింపులు, బలవంతానికి దారితీసిందని బాధితురాలు తెలిపింది. రెండు రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగాడని, తాను నిరాకరించడంతో బెదిరించాడని తెలిపింది. నీ ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ అన్నీ నా చేతిలోనే ఉంటాయి అంటూ ఎమ్మెల్యే బెదిరించాడని చెప్పింది. తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలో తీసుకెళ్లాడని, రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ భయపెట్టాడని బాధితురాలు ఆరోపించింది.
Also Read: Vivo V50 5G Price Drop: ఫ్లిప్‌కార్ట్‌లో 11 వేల భారీ తగ్గింపు.. చౌకగా వివో వీ50, లిమిటెడ్ స్టాక్!
‘ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేశాను. రెండు రోజులుగా బాగానే మాట్లాడాడు, ఆ తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించమని అడిగాడు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ నన్ను బెదిరించారు. నీ ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ అన్నీ నా చేతిలోనే ఉంటాయని బెదిరించాడు. మా ఇంటికి వచ్చి నన్ను వాహనంలో తీసుకెళ్లాడు. నేను, నా బాబు మాత్రమే ఉండటం ఆయనకు ఆసరాగా అయ్యింది. బలవంతపు రిలేషన్ షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించాడు. గర్భం వస్తే తీయించుకోమని చెప్పాడు. ప్రెగ్నెన్సీ తీయించుకోనని చెప్పినందుకు ఒక రోజు రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు. నేను ఆయనతోనే ఉండాలంటూ చాలా సార్లు బెదిరించాడు. నా భర్తకు విషయం తెలిసి.. మా బాబును తీసుకెళ్లాడు’ అని బాధితురాలు మీడియా సమావేశంలో చెప్పింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. సంబంధిత ఆరోపణలపై అధికారుల దర్యాప్తు కొనసాగాల్సి ఉందని, ఎమ్మెల్యే వైపు నుంచి స్పందన వెలువడాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
