MK Stalin Starts Speaking For India Programme: భారత ప్రధాని నరేంద్రమోదీని ప్రజలకు మరింత చేరువ చేసిన కార్యక్రమం మన్ కీ బాత్. దీని ద్వారా మోదీ ప్రతినెల ప్రజలతో కొన్ని విషయాలను పంచుకునే వారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో ధైర్యం చెప్పడం నుంచి, కొత్త పథకాల వివరాలు తెలిపడం వరకు ప్రతిది ఈ కార్యక్రమం ద్వారా మోడీ ప్రజలకు తెలిపేవారు. తమ ప్రభుత్వం సాధించిన ఘనతలు, మన హిస్టరీ ఇలా అన్నింటి గురించి ఆయన ఈ కార్యక్రమంలో ప్రస్తవించేవారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించకపోవడంతో ప్రారంభం నుంచే ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. అయితే విపక్షాల కూటమి ఇండియా ఈసారి ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రయత్నాలు చేస్తో్ంది. దీనికి సంబంధించి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇక విపక్ష కూటమిలో ముఖ్యనేత అయిన తమిళనాడు సీఎం స్టాలిన్ బీజేపీ సర్కారుపై యుద్ధానికి కొత్త ఆయుధాన్ని రెడీ చేస్తున్నారు.
Also Read: Near Death Experience: మరణించాక ఆత్మ ఏం చేస్తుంది?.. సంచలన ప్రకటన చేసిన అమెరికా డాక్టర్
ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి పోటీగా సరికొత్త ప్రోగ్రామ్ ను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆయన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.1 నిమిషం 14 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ‘చెక్ 1..2..3’ అంటూ ఆయన మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం పోడ్ కాస్ట్ సిరీస్ తరహాలో ఉంటుందని స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ పేరుతో పాడ్ కాస్ట్ సిరీస్‌ను ప్రారంభించనున్న ఆయన ట్విటర్ వేదిక దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, గత తొమ్మిదేళ్ల బీజేపీ సర్కారు వైఫల్యాలపై జాతిని ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడనున్నారు. ఇక ఈ సందర్భంగా బీజేపీ పై, మోడీపై ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. దేశాన్ని మోడీ సర్కార్ నాశనం చేస్తోందని, దేశంలో విద్వేషాలు రేగేలా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
ఇక తన పాడ్ కాస్ట్ సిరీస్ గురించి చెబుతూ ఇది ప్రశ్న, దానికి సమాధానం తరహాలో ఉంటుందని వెల్లడించారు. ఇక దీనిని ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషలలోకి కూడా అనువాదం చేస్తారన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా దేశ భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీ మరోసారి అవకాశం ఇవ్వొద్దని స్టాలిన్ ప్రజలను కోరారు. చూడాలి మన్ కీ బాత్ కి పోటీగా వచ్చిన ఈ కార్యక్రమం ఎంతవరకు ప్రజలకు చేరువ అవుతుందో.